Yuzvendra Chahal: ఇక అంతా ఓపెన్!... ఆర్జే మహ్వాష్ తో కలిసి ఉన్న ఫొటో షేర్ చేసిన చహల్

భారత క్రికెట్ ఆటగాడు యుజ్వేంద్ర చాహల్, ఆర్జే మహ్వాష్‌తో కలిసి ఉన్న ఒక ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందనే వార్తలకు బలం చేకూరింది. చాహల్ తన భార్య ధనశ్రీ వర్మతో విడాకుల అనంతరం ఈ ఫోటోను షేర్ చేయడంతో, ఇది మరింత చర్చనీయాంశంగా మారింది. ఇటీవల చహల్, ఆర్జే మహ్వష్ తరచుగా జంటగా కనిపిస్తున్నారు.
అదే సమయంలో ఆర్జే మహ్వాష్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా దిగిన కొన్ని ఫోటోలను పంచుకున్నారు. అందులో ఆమె పంజాబ్ కింగ్స్ జట్టుకు మద్దతు తెలుపుతూ కనిపించారు. అయితే, అందరి దృష్టిని ఆకర్షించిన ఫోటో మాత్రం చాహల్‌తో కలిసి దిగిన పిక్ అని చెప్పాలి. భార్యతో విడాకుల తర్వాత చహల్ ఈ పిక్ పోస్ట్ చేయడం చూస్తుంటే... మహ్వాష్ తో తన రిలేషన్ పై స్పష్టత ఇచ్చినట్టు అర్థమవుతోంది. ఇక దాచిపెట్టేది ఏం లేదు... అంతా ఓపెన్ అన్నట్టుగా చహల్ క్లారిటీ ఇచ్చినట్టయింది.
ఈ ఫోటోకు మహ్వాష్ ఒక ఆసక్తికరమైన క్యాప్షన్ జత చేశారు. "కష్ట సమయాల్లో అండగా నిలిచే వ్యక్తికి నేను ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటాను. మేము ఎల్లప్పుడూ నీతో ఉంటాం చహల్" అని రాసుకొచ్చారు. దీనికి చహల్ స్పందిస్తూ.. "నువ్వు నా వెన్నెముక! నన్ను ఎల్లప్పుడూ ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు" అని సమాధానమిచ్చాడు.
చహల్, మహ్వాష్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులతో సామాజిక మాధ్యమాల్లో చర్చ తీవ్రస్థాయికి చేరింది. నెటిజన్లు వారి మధ్య ఏదో ఉందని చర్చించుకుంటున్నారు.
