తిరుపతి-కాట్పాడి ట్రాక్ డబ్లింగ్ పై ప్రధాని మోదీ ట్వీట్... చంద్రబాబు స్పందన
- తిరుపతి-కాట్పాడి రైలు మార్గం డబ్లింగ్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- రూ. 1,332 కోట్ల నిధులు మంజూరు
- ఏపీ, తమిళనాడు మధ్య రద్దీని తగ్గిస్తుందన్న మోదీ
- వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందన్న చంద్రబాబు
"తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్ డబ్లింగ్ ప్రాజెక్టుకు రూ. 1,332 కోట్లు మంజూరు చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు, కేంద్ర మంత్రివర్గానికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ప్రాజెక్టుతో తిరుపతి బాలాజీ ఆలయం, శ్రీకాళహస్తి శివాలయం , చంద్రగిరి కోట వంటి పవిత్ర స్థలాలను అనుసంధానం చేసేందుకు వీలవుతుంది.
అంతేకాకుండా, ఇది వేలూరు, తిరుపతి వంటి విద్యా, వైద్య కేంద్రాలకు రాకపోకలను సులభతరం చేస్తుంది. ఇది వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రానిక్స్, సిమెంట్, ఉక్కు పరిశ్రమల వృద్ధిని వేగవంతం చేస్తుంది. చిత్తూరు, తిరుపతి జిల్లాలకు, ఈ లైన్ కనెక్టివిటీ, అభివృద్ధి యొక్క కొత్త శకానికి నాంది పలుకుతుంది" అని చంద్రబాబు పేర్కొన్నారు.