Manchu Vishnu: ఇవాళ నా ఫేవరెట్ హీరోని కలిశాను: మంచు విష్ణు

- యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలిసిన కన్నప్ప టీమ్
- సీఎం చేతుల మీదుగా కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల
- ఎంతో సంతోషం కలిగించిందన్న మంచు విష్ణు
టాలీవుడ్ కథానాయకుడు మంచు విష్ణు ఇవాళ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కలిశారు. తాను నటించిన కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్ ను యోగి ఆదిత్యనాథ్ చేతులమీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు మోహన్ బాబు, దర్శకుడు ముఖేశ్ కుమార్ సింగ్, ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా కూడా పాల్గొన్నారు. దీనిపై మంచు విష్ణు సోషల్ మీడియాలో స్పందించారు.
"నా ఫేవరెట్ హీరోల్లో ఒకరైన యోగి ఆదిత్యనాథ్ గారిని కలిశాను. ఆయన మా కన్నప్ప చిత్రం రిలీజ్ డేట్ పోస్టర్ ను ఆవిష్కరించడం ఎంతో సంతోషం కలిగించింది. ప్రముఖ చిత్రకారుడు రమేశ్ గురజాల గీసిన పెయింటింగ్ ను యోగి ఆదిత్యనాథ్ కు బహూకరించాను. ఆయన ఎంతో సౌమ్యుడు, దివ్య తేజస్సు కలిగిన వ్యక్తి" అని మంచు విష్ణు అభివర్ణించారు.