Indian Stock Market: వాణిజ్య యుద్ధ భయాలు... నష్టాల్లో ముగిసిన మార్కెట్లు

- 379 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 136 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 3 శాతానికి పైగా పతనమైన ఎస్టీఐ షేర్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఆర్బీఐ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించినప్పటికీ... వాణిజ్య యుద్ధ భయాలు మదుపరులను వెంటాడాయి.
ఈ క్రమంలో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 379 పాయింట్లు నష్టపోయి 73,847కి పడిపోయింది. నిఫ్టీ 136 పాయింట్లు కోల్పోయి 22,399 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 86.69గా ఉంది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్
నెస్లే ఇండియా (3.24%), హిందుస్థాన్ యూనిలీవర్ (2.63%), టైటాన్ (1.66%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (1.56%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.03%).
టాప్ లూజర్స్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (-3.43%), టెక్ మహీంద్రా (-3.35%), ఎల్ అండ్ టీ (-3.23%), టాటా స్టీల్ (-2.30%), సన్ ఫార్మా (-2.18%).