YS Avinash Reddy: ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు: వైఎస్ అవినాశ్ రెడ్డి

- మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాను పరామర్శించిన అవినాశ్
- అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపాటు
- కూటమి ప్రభుత్వం రాక్షసానందం పొందుతోందని మండిపాటు
వైసీపీ కేడర్ వినాశనమే లక్ష్యంగా ఏపీ అధికారులు పనిచేస్తున్నారని వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి మండిపడ్డారు. అక్రమ కేసులు పెట్టి వైసీపీ నేతలను అరెస్ట్ చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం రాక్షసానందం పొందుతోందని అన్నారు. అన్నీ గుర్తు పెట్టుకుంటామని, అందరినీ గుర్తు పెట్టుకుంటామని... అక్రమ కేసులు పెడుతూ, వేధింపులకు గురి చేస్తున్న ఎవరినీ ఎవరినీ వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు.
మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాను కడపలో అవినాశ్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అవినాశ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అంజాద్ బాషా సోదరుడు అహ్మద్ బాషాను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అంజాద్ బాషాను అవినాశ్ పరామర్శించారు.
తీవ్రవాది మాదిరి అహ్మద్ బాషాను ముంబైకి వెళ్లి తీసుకొచ్చారని మండిపడ్డారు. అహ్మద్ బాషాను అరెస్ట్ చేసిన తర్వాత టీడీపీ నేతలు సంబరాలు చేసుకోవడం దారుణమని అన్నారు. తప్పుడు కేసు పెట్టి అహ్మద్ ను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. కడపలో టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు.