Vallabhaneni Vamshi: వల్లభనేని వంశీకి మరో ఎదురుదెబ్బ... రిమాండ్ పొడిగింపు

- గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ రిమాండ్ పొడిగింపు
- ఏప్రిల్ 23 వరకు రిమాండ్ విధిస్తూ సీఐడీ కోర్టు ఉత్తర్వులు
- వంశీతో పాటు రిమాండ్ ఖైదీలుగా ఉన్న మరో 9 మందిని కోర్టులో హాజరుపరిచిన అధికారులు
వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. గన్నవరం టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో ఆయన రిమాండ్‌ను మరోసారి సీఐడీ న్యాయస్థానం పొడిగించింది. ఏప్రిల్ 23 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో వంశీతో పాటు రిమాండ్ ఖైదీలుగా ఉన్న మరో తొమ్మిది మందిని బుధవారం నాడు సీఐడీ అధికారులు న్యాయస్థానంలో హాజరుపరిచారు.
అటు, సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో ఆయనకు న్యాయస్థానం మంగళవారం నాడు రిమాండ్‌ను పొడిగించిన విషయం తెలిసిందే. ఈ నెల 22 వరకు రిమాండ్ పొడిగిస్తూ విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.