Mark Shankar: మార్క్ శంకర్ గాయపడటంపై జూనియర్ ఎన్టీఆర్ ఆవేదన

- మార్క్ శంకర్ గాయపడ్డాడనే వార్త తెలిసి బాధపడ్డానన్న తారక్
- చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
- ధైర్యంగా ఉండు లిటిల్ వారియర్ అన్న తారక్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లోని స్కూల్లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో గాయపడ్డ సంగతి తెలిసిందే. చిన్నారి కాళ్లకు, చేతులకు గాయాలయ్యాయి. మార్క్ ఊపిరితిత్తుల్లోకి పొగ పోయింది. ప్రస్తుతం సింగపూర్ లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని సినీ, రాజకీయ ప్రముఖులు కోరుకుంటున్నారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వవన్ కల్యాణ్ గారి కుమారుడు గాయపడ్డాడనే వార్త తెలిసి ఎంతో బాధపడ్డానని చెప్పారు. చిన్నారి మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఎక్స్ వేదికగా తారక్ ఆకాంక్షించారు. 'ధైర్యంగా ఉండు లిటిల్ వారియర్' అని పోస్ట్ పెట్టారు.