Mohan Babu: మంచు కుటుంబంలో మళ్లీ రచ్చ.. మోహన్ బాబు ఇంటి వద్ద పోలీసుల మోహరింపు

Manchu Family Feud Reignites Police Deployed at Mohan Babus Residence

  • తన ఇంట్లో వస్తువులను, కారును విష్ణు తీసుకెళ్లాడంటూ మనోజ్ ఫిర్యాదు
  • తన ఇంట్లోకి చొరబడి దొంగతనానికి పాల్పడ్డారన్న మనోజ్
  • మోహన్ బాబు ఇంటి వద్ద గొడవ జరిగే అవకాశం ఉండటంతో అప్రమత్తమైన పోలీసులు

మంచు కుటుంబం మళ్లీ హీటెక్కింది. హైదరాబాద్ జల్ పల్లిలోని తన నివాసంలోని వస్తువులను, కారును తన అన్న మంచు విష్ణు ఎత్తుకెళ్లాడని పోలీసులకు మంచు విష్ణు ఫిర్యాదు చేశాడు. తన కూతురు పుట్టినరోజు కోసం భార్యతో కలిసి రాజస్థాన్ కు వెళ్లానని... తాము లేని సమయంలో విష్ణు, ఆయన అనుచరులు తన ఇంట్లోకి చొరబడి దొంగతనానికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జల్ పల్లిలోని ఇంటికి వెళ్తున్నానని చెప్పాడు. 

ఈ నేపథ్యంలో జల్ పల్లిలోని ఇంటి వద్ద గొడవ జరిగే అవకాశం ఉండటంతో... మోహన్ బాబు ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. కొన్ని రోజుల క్రితం అంతా సద్దుమణిగిందనుకున్న తరుణంలో... మంచు కుటుంబంలో మళ్లీ గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ మంటలు ఎప్పుడు చల్లారుతాయో వేచి చూడాలి. 

Mohan Babu
Manchu Vishnu
Manchu family feud
Hyderabad Police
Jalpally
Property dispute
Family drama
Telugu Cinema Family
Celebrity Family Dispute
  • Loading...

More Telugu News