అమరావతిలో 5 ఎకరాల స్థలంలో చంద్రబాబు సొంత ఇంటికి భూమిపూజ
- సచివాలయం వెనుక వెలకపూడి రెవెన్యూ పరిధిలో చంద్రబాబు ఇల్లు
- భూమి పూజకు హాజరైన నారా, నందమూరి కుటుంబ సభ్యులు
- 1,455 చ.గజాల విస్తీర్ణంలో జీ ప్లస్ వన్ మోడల్ లో ఇంటి నిర్మాణం
సచివాలయం వెనుక E9 రహదారి పక్కన వెలగపూడి రెవెన్యూ పరిధిలో 5 ఎకరాల భూమిలో ఇంటి నిర్మాణం చేయనున్నారు. రాజధాని కోర్ ఏరియాలో చంద్రబాబు ఇంటిని కట్టుకుంటున్నారు. 5 ఎకరాల స్థలంలో చంద్రబాబు నివాసంతో పాటు, పక్కనే కాన్ఫరెన్స్ హాల్, పార్కింగ్ ఏరియా ఉంటాయి. ఇంటిని 1,455 చదరపు గజాల విస్తీర్ణంలో జీ ప్లస్ వన్ మోడల్ లో నిర్మించనున్నారు. ఏడాదిన్నర సమయంలో ఇంటి నిర్మాణం పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.