Sai Abhyankar: అల్లు అర్జున్, అట్లీ సినిమాకి కొత్త మ్యూజిక్ డైరెక్టర్!

- భారీ బడ్జెట్ మూవీకి సంగీత దర్శకుడిగా ఎంపికైన 20 ఏళ్ల సాయి అభ్యంకర్
- రాక్ స్టార్ అనిరుధ్ వద్ద అడిషనల్ ప్రోగ్రామర్‌గా పని చేసిన సాయి అభ్యంకర్
- ప్లే బ్యాక్ సింగర్లుగా సంగీత ప్రపంచాన్ని ఏలిన టిప్పు, హరిణి దంపతుల కుమారుడే సాయి అభ్యంకర్
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాకు సంగీత దర్శకుడిగా సాయి అభ్యంకర్ ఎంపికైనట్లు ప్రచారం జరుగుతోంది. అధికారికంగా ఇంత వరకు ప్రకటన విడుదల కానప్పటికీ దాదాపు ఖరారైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 20 ఏళ్ల సాయి అభ్యంకర్ ఇప్పటి వరకు సంగీత దర్శకుడిగా ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ కొన్ని ప్రైవేటు సాంగ్స్ చేశాడు. అవన్నీ కూడా చార్ట్ బస్టర్స్‌గా నిలిచాయి.
ఇప్పటి వరకు రాక్ స్టార్ అనిరుధ్ వద్ద అడిషనల్ ప్రోగ్రామర్‌గా సాయి అభ్యంకర్ పనిచేశాడు. దేవత, కూలీ లాంటి సినిమాలకు అడిషనల్ ప్రోగ్రామర్‌గా వ్యవహరించాడు. అయితే ఇప్పుడు ఏకంగా అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమాకి సంగీత దర్శకుడిగా ఎంపికయ్యాడనే వార్తలు రావడంతో, ఎలాంటి నేపథ్యంతో ఈ అవకాశం దక్కించుకున్నాడని చాలా మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
సాయి అభ్యంకర్ సంగీత కుటుంబం నుంచే వచ్చాడు. దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం ప్లే బ్యాక్ సింగర్లుగా సంగీత ప్రపంచాన్ని ఏలిన టిప్పు, హరిణి దంపతుల కుమారుడే సాయి అభ్యంకర్. సంగీతంపై ఆసక్తితో అనిరుధ్ వద్ద పనిచేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఒకప్పుడు సంగీత ప్రపంచాన్ని ఏలిన ఏఆర్ రెహమాన్, హరీస్ జయరాజ్, యువన్ శంకర్ రాజాలు కూడా 27 ఏళ్ల వయసులోనే మొదటి భారీ బడ్జెట్ సినిమాలు చేశారు. అలాగే, అనిరుధ్ 23 ఏళ్లకే ఓ పెద్ద ప్రాజెక్టును సంపాదించాడు. అయితే సాయి అభ్యంకర్ మాత్రం 20 ఏళ్ల వయసులోనే పాన్ ఇండియా ప్రాజెక్టు దక్కించుకోవడం మామూలు విషయం కాదనే చర్చ ఇండస్ట్రీలో జరుగుతోంది.