Pawan Kalyan: ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, జగన్ లకు కృతజ్ఞతలు: పవన్ కల్యాణ్

Pawan Kalyan Expresses Gratitude to PM Modi CM Naidu and Jagan

  • సింగపూర్ లో అగ్నిప్రమాదం
  • గాయపడిన పవన్ తనయుడు
  • మార్క్ శంకర్ కు ఆసుపత్రిలో చికిత్స
  • పవన్ కు సానుభూతి తెలిపిన నేతలు
  • అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపిన పవన్ కల్యాణ్

సింగపూర్ లోని రివర్ వ్యాలీ రోడ్ లో ఉన్న ఓ భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడు. దాంతో ప్రధాని నరేంద్రమోదీ, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ఏపీ సీఎం చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్ తదితరులు పవన్ కల్యాణ్ కు సానుభూతి తెలిపారు. వారందరికీ పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపారు. 

"ఈ కష్టకాలంలో ఎంతో దయతో స్పందించి, మద్దతు ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా కుమారుడు మార్క్ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాడు. అతడి ఆరోగ్యం నిలకడగా ఉంది. క్రమంగా కోలుకుంటున్నాడు. సింగపూర్ లోని భారత దౌత్యకార్యాలయం అందిస్తున్న సహకారం నాకు గొప్ప ధైర్యాన్నిస్తోంది" అని పవన్ వివరించారు. 

మరో ట్వీట్ లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. "మీరు ఎంతో సానుభూతితో పంపిన సందేశానికి థాంక్యూ చంద్రబాబు గారూ...! మీ మద్దతుకు, మీ ప్రార్థనలకు ధన్యవాదాలు" అంటూ స్పందించారు. 

ఈ క్రమంలో వైసీపీ అధినేత జగన్, ఏపీ మంత్రులు నారా లోకేశ్, అనిత, నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, కందుల దుర్గేశ్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు... కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రి  బండి సంజయ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, తమిళనాడు సీఎం స్టాలిన్ లకు కూడా పవన్ ధన్యవాదాలు తెలియజేశారు.

Pawan Kalyan
Mark Shankar
Singapore Fire Accident
AP Deputy CM
Narendra Modi
Chandrababu Naidu
Jagan Mohan Reddy
Indian Embassy Singapore
Political Leaders
Son's Injury
  • Loading...

More Telugu News