Telangana Excise Department: 273 రకాల విదేశీ లిక్కర్ బ్రాండ్లు సహా 604 కొత్త బ్రాండ్లకు దరఖాస్తులు: తెలంగాణ ఆబ్కారీ శాఖ

- 331 రకాల స్వదేశీ లిక్కర్ బ్రాండ్లకూ దరఖాస్తులు వచ్చాయని వెల్లడి
- 604 బ్రాండ్లకు దరఖాస్తులు వచ్చాయని వెల్లడి
- 92 మద్యం సరఫరా కంపెనీలు దరఖాస్తు చేసినట్లు తెలిపిన ఆబ్కారీ శాఖ
తెలంగాణ రాష్ట్రంలో 331 స్వదేశీ, 273 విదేశీ మద్యం బ్రాండ్ల కోసం దరఖాస్తులు వచ్చినట్లు తెలంగాణ ఆబ్కారీ శాఖ తెలియజేసింది. రాష్ట్రంలో మద్యం సరఫరా చేయడానికి మొత్తం 604 కొత్త మద్యం బ్రాండ్లకు దరఖాస్తులు స్వీకరించినట్లు వెల్లడించింది.
47 కొత్త కంపెనీల నుంచి 386 రకాల కొత్త మద్యం బ్రాండ్లకు, అలాగే 45 పాత కంపెనీల నుంచి 218 కొత్త మద్యం బ్రాండ్లకు దరఖాస్తులు అందాయని పేర్కొంది.
తెలంగాణలో 604 కొత్త మద్యం బ్రాండ్ల అమ్మకాల అనుమతి కోసం 92 మద్యం సరఫరా కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయని ఆ శాఖ తెలిపింది.
మద్యం బ్రాండ్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఫిబ్రవరి 23వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసినట్లు టీజీబీసీఎల్ తెలిపింది. దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 2వ తేదీ వరకు అవకాశం ఇచ్చినట్లు వెల్లడించింది.
దరఖాస్తులను పరిశీలించిన అనంతరం కొత్త బ్రాండ్లకు ప్రభుత్వ ఆమోదముద్ర పడిన తర్వాత అనుమతి ఇస్తామని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ కమిషనర్ సి. హరికిరణ్ వివరించారు.