పవన్ తనయుడు ప్రమాదానికి గురైంది ఇక్కడే... వీడియో ఇదిగో!

  • సింగపూర్ లో అగ్నిప్రమాదం
  • కుకింగ్ స్కూల్ లో మంటలు చెలరేగిన వైనం
  • నలుగురు పెద్దవాళ్లు, 15 మంది పిల్లలకు గాయాలు
  • ఒక చిన్నారి మృతి
  • ఈ వార్తను ప్రముఖంగా ప్రసారం చేసిన సింగపూర్ మీడియా 
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తనయుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్ లో అగ్నిప్రమాదంలో గాయపడడం తెలిసిందే. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన వీడియోలు సింగపూర్ మీడియాలో ప్రముఖంగా ప్రసారమయ్యాయి. 

సింగపూర్ మీడియా తెలిపిన వివరాల ప్రకారం... ఈ ఉదయం 9.45 గంటలకు అగ్ని ప్రమాదం జరిగింది. రివర్ వ్యాలీ రోడ్ లో ఉన్న ఓ షాప్ హౌస్ లో మంటలు చెలరేగాయి. ఇందులో ఓ టమాటా కుకింగ్ స్కూల్ ఉంది. విద్యార్థులు సమ్మర్ క్యాంపులో భాగంగా ఇక్కడ వంటలకు సంబంధించిన పాఠాలు నేర్చుకుంటున్నారు. ఈ సందర్భంగానే అగ్నిప్రమాదం జరిగింది. ఈ భవనంలో 2వ, 3వ ఫ్లోర్లతో మంటలు చెలరేగాయి. 

దీనిపై వెంటనే స్పందించిన సింగపూర్ సివిల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఎస్ సీడీఎఫ్), స్థానికులు, కొందరు భవన నిర్మాణ కార్మికులు సహాయక చర్యల్లో పాల్గొని... కాలిపోతున్న భవనం నుంచి అనేకమందిని వెలుపలికి తీసుకువచ్చారు. గాయపడిన నలుగురు పెద్ద వాళ్లను, 15 మంది పిల్లలను ఆసుపత్రికి తరలించారు. ఒక చిన్నారి మృతి చెందినట్టు తెలిసింది.


More Telugu News