B.Tech Ravi: పులివెందుల టీడీపీలో బయటపడ్డ విభేదాలు!

Clash Between TDP Leaders in Pullivendula

  • బీటెక్ రవి, రాంగోపాల్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు
  • మంత్రి సవిత ఆధ్వర్యంలో పులివెందులలో విస్తృతస్థాయి సమావేశం
  • సవిత సమక్షంలో బాహాబాహీకి దిగిన ఇరు వర్గాలు

వైసీపీ అధినేత జగన్ ఇలాకా పులివెందులలో టీడీపీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. పులివెందుల పార్టీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి, టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి మధ్య చాలా కాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ క్రమంలో ఈరోజు పులివెందులలో జరిగిన టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఇరువర్గాలకు చెందిన వారు బాహాబాహీకి దిగారు. 

ఈ సమావేశం జిల్లా ఇన్ఛార్జ్, మంత్రి సవిత ఆధ్వర్యంలో జరిగింది. ఆమె సమక్షంలోనే ఇరు వర్గాలు గొడవకు దిగాయి. వేదికపై రాంగోపాల్ రెడ్డి ఉండకూడదని, వేదిక దిగిపోవాలని బీటెక్ రవి వర్గీయులు నినాదాలు చేశారు. దీంతో, రాంగోపాల్ రెడ్డి వర్గీయులు కూడా పోటీపోటీగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలకు సర్ది చెప్పారు. అనంతరం విస్తృతస్థాయి సమావేశం సజావుగా కొనసాగింది.

B.Tech Ravi
Ramgopal Reddy
TDP
Pullivendula
Factionalism
Andhra Pradesh Politics
Party Meeting
Political Conflict
TDP infighting
  • Loading...

More Telugu News