Ronin: గిన్నిస్ రికార్డుకెక్కిన చిట్టి ఎలుక.. ఇంతకీ అది ఏం పనిచేసి రికార్డు నెలకొల్పిందో తెలుసా..?

- బాంబుల నుంచి ఓ దేశాన్నే కాపాడి గిన్నిస్ రికార్డు సృష్టించిన ఎలుక
- కంబోడియాకు చెందిన ఎలుక రోనిన్‌కు ల్యాండ్‌మైన్‌లు, బాంబులు గుర్తించడం పని
- ఈ మైన్-డిటెక్టింగ్ ఎలుక 100కి పైగా ల్యాండ్‌మైన్‌లు, 15 బాంబులను గుర్తించిన వైనం
- తమను పేలుడు పదార్థాల నుంచి కాపాడుతున్న రోనిన్‌ను హీరోగా కీర్తిస్తున్న దేశ ప్రజలు
బాంబుల నుంచి ఓ దేశాన్నే కాపాడి ఎలుక గిన్నిస్ రికార్డు సృష్టించింది. కంబోడియాకు చెందిన ఎలుక రోనిన్‌కు ల్యాండ్‌మైన్‌లు, బాంబులు గుర్తించడం పని. దీంతో ఈ మైన్-డిటెక్టింగ్ ఎలుక 100కి పైగా ల్యాండ్‌మైన్‌లు, 15 బాంబులను గుర్తించింది. జంతువులకు శిక్షణ ఇచ్చే లాభాపేక్షలేని సంస్థ అపోపో ప్రకారం... ఆఫ్రికన్ దిగ్గజ పౌచ్డ్ ఎలుక అయిన రోనిన్ 2021 నుంచి ఇప్పటివరకూ ఇలా భారీ మొత్తంలో మైన్-డిటెక్టింగ్ తో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుందని తెలిపింది. కంబోడియాలో ప్రజల భద్రతకు ఇది ఎంతో దోహదపడుతుందని గిన్నిస్ రికార్డ్స్ వారు రోనిన్ ను హైలైట్ చేశారు. ఇక తమను పేలుడు పదార్థాల నుంచి కాపాడుతున్న రోనిన్‌ను ఆ దేశ ప్రజలు హీరోగా కీర్తిస్తున్నారు.
రోనిన్‌కు ముందు అత్యధికంగా పేలుడు పదార్థాలను గుర్తించిన రికార్డు మగవా అనే మరో ఎలుక పేరిట ఉండేది. అది ఐదు సంవత్సరాలలో 71 ల్యాండ్‌మైన్‌లు, 38 బాంబులను గుర్తించింది. 2021లో మగవా పదవీ విరమణ చేసింది. మగవా అద్భుతమైన సేవకు PDSA జంతు స్వచ్ఛంద సంస్థ దానికి ధైర్య పతకాన్ని అందించింది. కానీ, దురదృష్టవశాత్తు 2022 జనవరిలో వృద్ధాప్యం కారణంగా మరణించింది. ఇప్పుడు రోనిన్ 100కి పైగా ల్యాండ్‌మైన్‌లను గుర్తించి మగవా రికార్డును బద్దలు కొట్టింది. అత్యధిక పేలుడు పదార్థాలను గుర్తించిన ఎలుకగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకుంది.