Sujaykrishna Rangarao: ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా సుజయ్‌కృష్ణ రంగారావు

- సోమవారం జరిగిన ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం
- చైర్మన్‌గా సుజయ్‌కృష్ణ రంగారావు, సభ్యుడిగా వడ్లమాని సుధాకర్ చౌదరి ఎన్నిక
ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా బొబ్బిలి ఎమ్మెల్యే, మాజీ మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు, సభ్యుడిగా వడ్లమాని సుధాకర్ చౌదరి ఎన్నికయ్యారు. ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం సోమవారం జరిగింది.
త్వరలో జరగనున్న ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఏపీఎల్ లీగ్ – 2025 నిర్వహణ బాధ్యతలను చైర్మన్ హోదాలో సుజయ్‌కృష్ణ రంగారావు చేపట్టనున్నారు. పోటీల నిర్వహణ తేదీలు, ఫ్రాంచైజీల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు. ఈ సందర్భంగా ఏసీఏ అధ్యక్ష కార్యదర్శులు కేశినేని శివనాథ్ (చిన్ని), సానా సతీష్ బాబు, అపెక్స్ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన సుజయ్‌కృష్ణ రంగారావు 2004, 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ఆర్ మరణానంతరం 2012లో కాంగ్రెస్ పార్టీని వీడి వైసీపీలో చేరారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే రాష్ట్రంలో నాడు టీడీపీ ప్రభుత్వం ఏర్పడటంతో వైసీపీని వీడి టీడీపీలో చేరారు.
2016లో చంద్రబాబు ఆయనను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి తొలిసారి ఓటమి పాలయ్యారు. 2024 ఎన్నికల్లో తిరిగి బొబ్బిలి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనను అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించింది.