Nambi Marak: తన వంటతో సచిన్‌ను మెప్పించిన మహిళా చెఫ్ నంబీ మారక్

- అభిమాన క్రికెట్ హీరో సచిన్ కు తన చేతి వంట రుచి చూపించిన మేఘాలయ మహిళా చెఫ్ నంబీ మారక్
- తన వంటకాలను అమిత ఇష్టంగా సచిన్ ఆరగించారన్న నంబీ మారన్
- ట్రోఫీ గెలిచిన ఆనందం కంటే ఎక్కువగా ఉందన్న నంబీ మారన్
మేఘాలయకు చెందిన మహిళా చెఫ్ నంబీ మారక్ తన వంటకాలతో ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ను మెప్పించారు. తన అభిమాన క్రికెటర్‌కు తన చేతి వంట రుచి చూపించే అవకాశం రావడం పట్ల ఆమె ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు.
షిల్లాంగ్‌లోని తన ఇంటి గోడలపై సచిన్ టెండూల్కర్ పోస్టర్‌లను చూస్తూ పెరిగిన నంబీకి అనుకోని అవకాశం వరంగా వచ్చింది. సచిన్ తమ రాష్ట్ర పర్యటనకు విచ్చేసిన సందర్భంలో నంబీ మారక్ తమ ప్రాంత గారో సంప్రదాయ వంటకాలతో ఆతిథ్యమిచ్చారు.
తన అభిమాన క్రికెట్ హీరోకు వంట వడ్డించే అవకాశం లభించిందన్న సంతోషంతో ఎంతో శ్రద్ధతో వెజ్, నాన్ వెజ్ వంటకాలను తయారు చేసి సర్వ్ చేశారు. తాను వడ్డించిన వంటకాలను సచిన్ అమితంగా ఇష్టపడ్డారని నంబీ మారక్ తెలిపారు.
అందులో గుమ్మడికాయ చికెన్ కర్రీ ఆయన మనసును మెప్పించిందన్నారు. తన అభిమాన క్రికెట్ హీరోకు వండి పెట్టడం ఒక కల అని, ఇది ట్రోఫీ గెలిచిన ఆనందం కంటే ఎక్కువగా ఉందని చెఫ్ నంబీ పేర్కొన్నారు.