Royal Enfield theft: 15 సెకన్లలోనే రాయల్ ఎన్‌ఫీల్డ్ తాళం విరగ్గొట్టి.. బైక్‌తో పరారైన దొంగ.. వీడియో ఇదిగో!

- ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌పూర్‌లో ఘటన
- ఓ షాపు ముందు పార్క్ చేసిన రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350ని ఎత్తుకెళ్లిన దొంగ
- ఇంత కాస్ట్‌లీ బైక్‌కు అంత బలహీన లాకింగ్ సిస్టమా అని విమర్శలు
కేవలం 15 అంటే 15 సెకన్లలోనే ఓ దొంగ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ తాళం బద్దలుగొట్టి ఆపై దర్జాగా దాంతో పరారయ్యాడు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో నిన్న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మాస్క్ ధరించి వచ్చిన దొంగ స్క్రూడ్రైవర్ లాంటి సాధనంతో బైక్ తాళం విరగ్గొట్టి ఎంచక్కా దాంతో పరారయ్యాడు.
26 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో.. ఓ షాపు ముందు పార్క్ చేసిన బైక్ వద్దకు వచ్చిన దొంగ ఓ చిన్న పరికరంతో తాళం తెరిచాడు. అనంతరం సీటుపై కూర్చుని బైక్‌ను స్టార్ట్ చేసి క్షణాల్లో అక్కడి నుంచి మాయమయ్యాడు. బయటకు వచ్చి చూసుకున్న బైక్ యజమాని తన వాహనం కనిపించకపోవడంతో లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్‌కు పరిగెట్టి ఫిర్యాదు చేశాడు. అలాగే, షాపు వద్దనున్న సీసీటీవీ ఫుటేజీని కూడా పోలీసులకు అందించాడు.
వైరల్ అవుతున్న ఈ వీడియోపై నెటిజన్లు స్పందిస్తున్నారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ లాంటి బైక్‌కు అంత బలహీన లాకింగ్ సిస్టమా? అని విమర్శిస్తున్నారు. ఈ మాత్రానికి ఇంత డబ్బులు ఖర్చు చేసి ఈ బైక్‌ను ఎందుకు కొనాలని ప్రశ్నిస్తున్నారు. నోయిడాలో తన బుల్లెట్ కూడా ఇలాగే చోరీకి గురైందని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. కాగా, తాజాగా చోరీకి గురైన రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 ధర ఇంచుమించు రూ. 2,25,000. ఈ బైక్ ఫుల్‌ట్యాంక్ 13 లీటర్లు. గంటకు 41.55 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది.