Warren Buffett: ట్రంప్ టారిఫ్‌ల ప్రభావానికి ఎదురొడ్డి నిలిచిన యోధుడు ఇతడే!

Warren Buffett Defies Trump Tariffs Impact

  • గత రెండు రోజుల వ్యవధిలోనే దాదాపు 5 ట్రిలియన్ డాలర్ల నష్టాన్ని నమోదు చేసిన యూఎస్ స్టాక్ మార్కెట్లు 
  • ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, జూకర్ బర్గ్, బెర్నార్డ్ అర్నాల్ట్ వంటి వారు వందల బిలియన్ డాలర్లు నష్టపోయిన వైనం
  • ముందస్తు అంచనాతో జాగ్రత్తలు పాటించి నిలదొక్కుకున్న వారెన్ బఫెట్ 

డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటివరకు 184 దేశాలపై సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. ఫలితంగా వాల్ స్ట్రీట్ విలువ దాదాపు 8 ట్రిలియన్ డాలర్ల మేర క్షీణించడంతో ప్రస్తుత మార్కెట్లు కుదేలయ్యాయి. ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, జూకర్ బర్గ్, బెర్నార్డ్ అర్నాల్ట్ వంటి వారు వందల బిలియన్ డాలర్లు నష్టపోయారు. గత రెండు రోజుల వ్యవధిలోనే యూఎస్ స్టాక్ మార్కెట్లు దాదాపు 5 ట్రిలియన్ డాలర్ల నష్టాన్ని నమోదు చేశాయి. 2020 మార్చిలో కొవిడ్ మహమ్మారి తర్వాత ఇదే అత్యంత భారీ పతనం.

అయితే ఈ ట్రెండ్ బెర్క్ షైర్ హాత్వే చైర్మన్, సీఈఓ వారెన్ బఫెట్‌పై మాత్రం ఎలాంటి ప్రభావం చూపలేదు. అమెరికా స్టాక్ మార్కెట్‌లో బఫెట్ జోరు కొనసాగిస్తున్నారు. తన కంపెనీలో పెట్టుబడులతో బఫెట్ లాభాలను ఆర్జిస్తూనే ఉన్నారు. ఈ ఏడాది ఆయన తన సంపదకు 12.7 బిలియన్ డాలర్లు జోడించారు. ప్రస్తుతం బఫెట్ సంపద 155 బిలియన్ డాలర్లుగా ఉంది.

2024లో బుల్ మార్కెట్లు ఊగిసలాటలో ఉన్న సమయంలోనే బఫెట్ కంపెనీ ఈక్విటీల్లో 134 బిలియన్ డాలర్లను విక్రయించి 334 బిలియన్ డాలర్ల నగదుతో ఏడాది ముగించింది. మార్కెట్ తిరోగమనం సంభవిస్తుందనే ముందస్తు అంచనాతో బఫెట్ మెల్లగా యాపిల్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి యూఎస్ టెక్ స్టాక్స్‌లో పెట్టుబడులు తగ్గించడంతో పాటు జపాన్ ట్రేడింగ్ దిగ్గజాలపై పెట్టుబడులు రెట్టింపు చేశారు. దీంతో తాజా ట్రెండ్ బఫెట్‌పై ఎలాంటి ప్రభావం చూపలేదు. 

Warren Buffett
Trump Tariffs
Stock Market
US Economy
Investment Strategy
Billionaire
Berkshire Hathaway
Economic Impact
Apple Stock
Japan Trading
  • Loading...

More Telugu News