BJP: 2023-24 ఆర్థిక సంవత్సరంలో బీజేపీకి రూ. 2,243 కోట్ల విరాళాలు: ఏడీఆర్

BJP Receives Rs 2243 Crore in Donations ADR Report

  • అన్ని పార్టీలకు వచ్చిన విరాళాలు రూ. 2,544 కోట్లు
  • ఒక్క బీజేపీకే 88 శాతం విరాళాలు
  • రూ. 281 కోట్లతో రెండో స్థానంలో కాంగ్రెస్

2023-24 ఆర్థిక సంవత్సరానికి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రూ. 2,243 కోట్ల విరాళాలు స్వీకరించింది. అసోసియేటెడ్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) జాతీయ పార్టీలు ఆ ఆర్థిక సంవత్సరంలో పొందిన విరాళాల వివరాలను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అత్యధిక విరాళాలు పొందిన పార్టీగా నిలిచింది.

అన్ని జాతీయ పార్టీలకు కలిపి మొత్తం రూ. 2,544.28 కోట్ల విరాళాలు అందాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం రూ. 12,547 కోట్లుగా నమోదైంది.

2023-24 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన విరాళాలలో బీజేపీ వాటా 88 శాతంగా ఉంది. రూ. 281 కోట్ల విరాళాలతో కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ, సీపీఎం, నేషనల్ పీపుల్స్ పార్టీలు ఉన్నాయి. తమకు ఎలాంటి విరాళాలు అందలేదని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) ప్రకటించింది.

BJP
Political Donations
India
ADR Report
2023-24 Financial Year
National Parties
Congress
AAP
CPI(M)
BSP
  • Loading...

More Telugu News