G Parameshwara: బెంగళూరు వీధుల్లో యువతిపై లైంగిక వేధింపులు... హోంమంత్రి వ్యాఖ్యలపై దుమారం

Bengaluru Street Harassment Home Ministers Remarks Spark Outrage

  • బెంగళూరులో యువతిని అసభ్యంగా తాకి పారిపోయిన వ్యక్తి
  • ఇలాంటి ఘటనలు సిటీలో సాధారణమేనన్న హోంమంత్రి పరమేశ్వర
  • మంత్రి వ్యాఖ్యలు ఇలాంటి నేరాలను ప్రోత్సహించే విధంగా ఉన్నాయంటూ విమర్శలు

బెంగళూరులో ఇటీవల జరిగిన లైంగిక వేధింపుల ఘటనపై కర్ణాటక హోం మంత్రి జి. పరమేశ్వర చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. నగరాల్లో ఇలాంటి ఘటనలు సాధారణమని ఆయన చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు, మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

నగరంలో సుద్దగుంటెపాళ్య ప్రాంతంలో రాత్రి వేళ ఇద్దరు యువతులు నడుచుకుంటూ వెళుతుండగా... ఓ వ్యక్తి వారిని వెంబడించి, వారిలో ఒకరిని అసభ్యంగా తాకి పారిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని మంత్రి పరమేశ్వర తెలిపారు.

అయితే, ఈ ఘటనపై స్పందిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. బెంగళూరు వంటి పెద్ద నగరాల్లో ఇలాంటి లైంగిక వేధింపులు కామన్ అని, ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటాయని అన్నారు. అయితే, వీటిని నివారించడానికి పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మంత్రి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళల భద్రతకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రజలు నిలదీస్తున్నారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి నిర్లక్ష్యపూరితమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని నెటిజన్లు మండిపడుతున్నారు.

మహిళా సంఘాలు కూడా మంత్రి వ్యాఖ్యలను ఖండించాయి. ఇలాంటి వ్యాఖ్యలు వేధింపులను ప్రోత్సహించే విధంగా ఉన్నాయని, ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించాలని డిమాండ్ చేశాయి.

G Parameshwara
Bengaluru sexual harassment
Karnataka Home Minister
women's safety
India
social media outrage
viral video
crime against women
police action
sexual assault
  • Loading...

More Telugu News