Shivaji: ‘దండోరా’ సెకండ్ షెడ్యూల్ ప్రారంభం.. షూటింగ్‌లో పాల్గొంటున్న విల‌క్ష‌ణ న‌టుడు శివాజీ

Dandora Movie Second Schedule Begins with Shivaji

  • రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మాణంలో 'దండోరా' చిత్రం
  • సెకండ్ షెడ్యూల్ ప్రారంభం
  • సెట్స్ పై అడుగుపెట్టిన శివాజీ

నేష‌న‌ల్ అవార్డ్ గెలుచుకున్న ‘క‌ల‌ర్ ఫోటో’, బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ ‘బెదురులంక 2012’ చిత్రాల‌ను నిర్మించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన‌ లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అధినేత ర‌వీంద్ర బెన‌ర్జీ ముప్పానేని రూపొందిస్తోన్న తాజా చిత్రం ‘దండోరా’. ముర‌ళీకాంత్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోంది. ఇందులో విలక్షణ నటుడు శివాజీతో పాటు, నవదీప్, నందు, రవి కృష్ణ, మణిక, అనూష, రాధ్య‌ తదితరులు నటిస్తున్నారు. 

ఇప్ప‌టికే ఫ‌స్ట్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం తాజాగా సెకండ్ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ‌ను ప్రారంభించింది. 25 రోజుల పాటు కంటిన్యూగా జ‌ర‌గ‌నున్న ఈ షెడ్యూల్‌లో విల‌క్ష‌ణ న‌టుడు శివాజీ పాల్గొంటున్నారు. నైంటీస్‌, కోర్ట్ వంటి డిఫ‌రెంట్ కంటెంట్‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన ఈ వెర్సటైల్ యాక్ట‌ర్ ఇప్పుడు దండోరా చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. 

రీసెంట్‌గా విడుద‌లైన ఫ‌స్ట్ బీట్ వీడియోకు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది.  అగ్ర వర్ణాలకు చెందిన అమ్మాయిలని ప్రేమించి పెళ్లి చేసుకున్నా, అగ్ర వర్ణాలకు ఎదురు తిరిగినా ఎలాంటి దౌర్జన్యకాండలు జరుగుతున్నాయనే అంశాన్ని ఆధారంగా చేసుకుని దండోరా సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలంగాణ గ్రామీణ నేప‌థ్యంలో మ‌న పురాత‌న ఆచారాలు, సాంప్ర‌దాయాల‌ను ఆవిష్క‌రిస్తూనే వ్యంగ్యం, చ‌క్క‌టి హాస్యం, హృద‌యాన్ని హ‌త్తుకునే భావోద్వేగాల క‌ల‌యిక‌గా ఈ సినిమాను ఆవిష్కరిస్తున్నారు. 

మార్క్ కె.రాబిన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. వెంక‌ట్ ఆర్‌.శాఖ‌మూరి సినిమాటోగ్ర‌ఫీ, గ్యారీ బి.హెచ్ ఎడిటింగ్‌, క్రాంతి ప్రియ‌మ్ ఆర్ట్ డైరెక్ట‌ర్‌, రేఖ బొగ్గారపు కాస్ట్యూమ్ డిజైన‌ర్‌, ఎడ్వ‌ర్డ్ స్టీవ్‌స‌న్ పెరెజీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌, అనీష్ మ‌రిశెట్టి కో ప్రొడ్యూస‌ర్‌గా బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ మూవీకి సంబంధించి మ‌రిన్ని వివ‌రాల‌ను తెలియ‌జేస్తామ‌ని మేక‌ర్స్ తెలియ‌జేశారు. 


Shivaji
Dandora Movie
Telugu Movie
Dandora Second Schedule
Ravindra Benarjee Muppaneni
Muraleekant
Telugu Cinema
Tollywood
Telangana Rural backdrop
Versatile Actor
  • Loading...

More Telugu News