Mary Kom: విడాకులు తీసుకోబోతున్న మేరీకోమ్... మరో వ్యక్తితో కొత్త జీవితం...!

- 20 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలకబోతున్న మేరీకోమ్
- బిజినెస్ పార్టనర్ తో రిలేషన్ లో ఉన్నట్టు వార్తలు
- 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మేరీకోమ్ భర్త
మన దేశానికి గర్వకారణమైన దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ తన 20 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలకబోతున్నారు. మేరీకోమ్ దంపతులు విడాకులు తీసుకోబోతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. మేరీకోమ్, ఆమె భర్త ఓన్లర్ కరుంగ్ విడాకులు తీసుకోబోతున్నారట. త్వరలోనే విడాకుల ప్రక్రియ ప్రారంభం కానుందని సమాచారం.
2022లో జరిగిన మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు ప్రారంభమయ్యాయని చెబుతున్నారు. ఆ ఎన్నికల్లో మేరీకోమ్ భర్త పోటీ చేసి ఓడిపోయారు. దీంతో, వీరికి భారీగా ఆర్థిక నష్టం వాటిల్లింది. భార్యాభర్తల మధ్య విభేదాలకు ఇది కారణమయింది. అప్పటి నుంచి ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారనే వార్తలు ఇంతకుముందే వచ్చాయి. ప్రస్తుతం మేరీకోమ్ తన నలుగురు పిల్లలతో కలిసి ఫరీదాబాద్ లో ఉండగా... ఆమె భర్త మరికొందరు కుటుంబసభ్యులతో కలిసి ఢిల్లీలో ఉంటున్నారు.
మరోవైపు, భర్తకు దూరంగా ఉన్న మేరీకోమ్ తన బిజినెస్ పార్టనర్ హితేశ్ చౌదరీతో రిలేషన్ లో ఉన్నారనే వార్తలు వచ్చాయి. మేరీకోమ్ ఫౌండేషన్ కు ఆయన ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఇద్దరూ రిలేషన్ లో ఉన్నారనే వార్తలు వస్తున్న తరుణంలో... తన సోషల్ మీడియాలో వరుసగా మేరీకోమ్ ఫొటోలను షేర్ చేస్తూ ఆ వార్తలకు హితేశ్ బలం చేకూరుస్తున్నారు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... హితేశ్ చౌదరి భార్య కూడా ఓ బాక్సర్ అని తెలుస్తోంది.