Golden Tiger: గోల్డెన్ టైగర్‌ను చూశారా?... ఇవిగో ఫొటోలు!

అస్సాంలోని కజిరంగా జాతీయ పార్కులో అరుదైన గోల్డెన్ టైగర్ దర్శనమిచ్చింది. వన్యప్రాణి ఫోటోగ్రాఫర్ సుధీర్ శివరామ్ ఈ బంగారు వర్ణపు పులి ఫొటోలను తన కెమెరాలో బంధించారు. సూడోమెలనిజం అనే అరుదైన జన్యు మార్పు కారణంగా ఇవి తేలికపాటి చారలతో బంగారు-నారింజ రంగులో ఉంటాయని పశుసంరక్షణ నిపుణులు చెబుతున్నమాట.
ఇలాంటివి చాలా అరుదని, ఎక్కడో ఓ చోట మాత్రమే కనిపిస్తాయని చెబుతున్నారు. ప్రకృతి ఎంత అద్భుతంగా, ఆశ్చర్యకరంగా ఉంటుందో ఈ ఫొటోలు గుర్తు చేస్తున్నాయని నిపుణులు అంటున్నారు. భారత వన్యప్రాణుల అందాన్ని చూపించే ఇలాంటివి జీవితంలో ఒకసారి మాత్రమే చూడగలిగే అద్భుతమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం... మీరూ గోల్డెన్ టైగర్‌పై ఓ లుక్కేయండి.