Akhil Akkineni: ఎట్టకేలకు అఖిల్ సినిమాపై బిగ్ అప్‌డేట్!

- అఖిల్, మురళీ కిశోర్ అబ్బూరు కాంబినేషన్‌లో కొత్త ప్రాజెక్ట్
- రేపు హీరో పుట్టినరోజు సందర్భంగా టైటిల్ గ్లింప్స్ విడుదల
- ఈ మేరకు ప్రత్యేక పోస్టర్‌ను రిలీజ్ చేసిన మేకర్స్
టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని కొత్త సినిమా అప్‌డేట్ కోసం అభిమానులు చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అఖిల్ చివరి చిత్రం ఏజెంట్ వచ్చి రెండేళ్లు కావొస్తోంది. దీంతో అఖిల్ కొత్త సినిమా గురించి అభిమానుల్లో చాలా ఆసక్తి నెలకొంది. వారి నిరీక్షణకు తెరదించుతూ తాజాగా బిగ్ అప్‌డేట్ వచ్చింది.
అఖిల్, కొత్త దర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరు కాంబినేషన్‌లో వస్తున్న సినిమా తాలూకు టైటిల్ గ్లింప్స్‌ను రేపు (మంగళవారం) విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. "ప్రేమ కంటే హింసాత్మకమైన యుద్ధం మరొకటి లేదు" అనే క్యాప్షన్‌తో ఒక ప్రత్యేక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.
కాగా, అఖిల్ పుట్టినరోజు కానుకగా రేపు టైటిల్, ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేస్తున్నారు. ఇది అఖిల్ హీరోగా వస్తున్న ఆరో సినిమా.
సితార ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌తో కలిసి అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ కాగా, దీనికి ‘లెనిన్’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఇది చిత్తూరు రూరల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందే యాక్షన్ థ్రిల్లర్ అని తెలుస్తోంది. ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది.