అమరావతికి రూ.4200 కోట్లు రిలీజ్ చేసిన కేంద్రం
- సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ల కృషి వల్లేనని ఎంపీల వివరణ
- ఏపీ రాజధాని అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందంటున్న నేతలు
- కూటమి పాలనలో రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని వెల్లడి
ఈ క్రమంలోనే కేంద్రం తాజాగా అమరావతి అభివృద్ధికి నిధులు విడుదల చేసింది. పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్టులకు సైతం చేయూతనిచ్చింది. వేల కోట్ల నిధులను ఇప్పటికే అందించింది. ఈ విషయంపై కూటమి పార్టీల ఎంపీలు మాట్లాడుతూ .. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ల కృషి వల్లే రాష్ట్రానికి నిధులు వస్తున్నాయని చెప్పారు. తాజాగా విడుదల చేసిన నిధులతో ఏపీ మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.