Google DeepMind: ఏఐ తో మానవాళికి ముప్పు తప్పందంటున్న గూగుల్

Google DeepMind Warns of AI Threat to Humanity

  • 2030 నాటికి మనుషులను ‘కృత్రిమ మేధ’ మించిపోతుందని అంచనా
  • గూగుల్ డీప్ మైండ్ పరిశోధనా పత్రంలో వెల్లడి
  • కృత్రిమ మేధ నియంత్రణలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని హితవు

కృత్రిమ మేధ.. రోజురోజుకూ మరింత అడ్వాన్స్ అవుతున్న ఈ సాంకేతిక పరిజ్ఞానం భవిష్యత్తులో మానవాళి మనుగడకే ప్రమాదంగా మారుతుందనే భయాందోళనలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి. ఈ ఆందోళన తొందర్లోనే నిజం కాబోతోందని తాజా పరిశోధనలో వెల్లడైంది. గూగుల్ డీప్ మైండ్ తన పరిశోధనా పత్రంలో ఈ వివరాలు వెల్లడించింది. 2030 నాటికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మరింత అభివృద్ధి చెందుతుందని, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ)గా రూపాంతరం చెందుతుందని పేర్కొంది.

ఈ వెర్షన్ మనుషులను మించిపోతుందని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏఐ పరిమితులను అధిగమిస్తుందని తెలిపింది. ఏఐకి మానవ తెలివితేటలు రావడంతో పాటు మానవులతో సమానంగా పనిచేయగల ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధి చెందుతుందని పేర్కొంది. ఈ పరిణామంతో మానవాళి అస్తిత్వం ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు డీప్ మైండ్ సీఈవో, కో ఫౌండర్ షేన్ లెగ్ మాట్లాడుతూ.. మానవాళికి ఏజీఐ తీవ్ర హాని తలపెట్టే ప్రమాదం ఉందని తాము అంచనా వేస్తున్నట్లు చెప్పారు. అయితే, ఈ ముప్పు ఎలాంటిది, మానవాళి మనుగడకు ముప్పు ఎలా వస్తుందనే వివరాలను ఆయన వెల్లడించలేదు.

తమ పరిశోధన ఏఐని నియంత్రణలో ఉంచడంపైనే కేంద్రీకరించామని, దానివల్ల ఎదురయ్యే ముప్పును తప్పించే ప్రయత్నాలపై లోతుగా అధ్యయనం చేశామని వివరించారు. ఏఐని దుర్వినియోగం చేస్తూ ఇతరులకు హాని కలిగించేందుకు ఉపయోగించకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. డీప్ మైండ్ పరిశోధనా పత్రంలో వెల్లడించిన వివరాల ప్రకారం.. మిస్ యూజ్, మిస్ అలైన్ మెంట్, మిస్టేక్స్, స్ట్రక్చరల్ రిస్క్ వంటి అంశాలతో ఏజీఐతో నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. ఈ నష్టాలను తప్పించేందుకు డెవలపర్లు భద్రతా ప్రోటోకాల్ ను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. మనుషులకు ముప్పు కలిగించే పనులకు సంబంధించి ఏజీఐ సామర్థ్యాన్ని పరిమితం చేయాలని పేర్కొంది.

Google DeepMind
Artificial General Intelligence
AGI
Artificial Intelligence
AI risks
AI safety
Shane Legg
AI threat to humanity
Technological Singularity
2030 AI
  • Loading...

More Telugu News