Sunrisers Hyderabad: సన్ రైజర్స్ కు ఏమైంది?... గుజరాత్ టైటాన్స్ చేతిలోనూ ఓటమి

- ఉప్పల్ లో సన్ రైజర్స్ × గుజరాత్ టైటాన్స్
- 7 వికెట్ల తేడాతో ఓడిన సన్ రైజర్స్
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గుజరాత్
- 20 ఓవర్లలో 8 వికెట్లకు 152 పరుగులు చేసిన సన్ రైజర్స్
- 16.4 ఓవర్లలో జయభేరి మోగించిన గుజరాత్
ఐపీఎల్-2025లో సన్ రైజర్స్ హైదరాబాద్ పరాజయాల ప్రస్థానం కొనసాగుతోంది. హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో సన్ రైజర్స్ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 152 పరుగులు చేయగా... 153 పరుగుల విజయలక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ మరో 20 బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఈ క్రమంలో 3 వికెట్లు నష్టపోయి 16.4 ఓవర్లలో 153 పరుగులు చేసింది.
కెప్టెన్ శుభ్ మన్ గిల్ అర్ధసెంచరీతో జట్టును ముందుండి నడిపించాడు. గిల్ 43 బంతుల్లో 9 ఫోర్లతో 61 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఓపెనర్ సాయి సుదర్శన్ (5), జోస్ బట్లర్ (0) ఒక్క పరుగు తేడాతో వెనుదిరిగినా... గిల్, వాషింగ్టన్ సుందర్ జోడీ మూడో వికెట్ కు 90 పరుగులు జోడించి జట్టును గెలుపు ముంగిట నిలిపింది.
సుందర్ అవుటైనా... షెర్ఫానే రూథర్ ఫోర్డ్ జతగా గిల్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. రూథర్ ఫోర్డ్ 16 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ తో 35 పరుగులు చేశాడు. సన్ రైజర్స్ బౌలర్లలో షమీ 2, కెప్టెన్ కమిన్స్ 1 వికెట్ తీశారు. కాగా, సన్ రైజర్స్ కు ఇది వరుసగా నాలుగో ఓటమి.