Hema: కరాటే కల్యాణికి నోటీసులు పంపిన హేమ... ఎందుకంటే!

Hema Sends Legal Notices to Karate Kalyani and Others

  • తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్న హేమ
  • తన న్యాయవాదుల ద్వారా లీగల్ నోటీసులు 
  • చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వెల్లడి

తనపై కొన్ని యూట్యూబ్ చానళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ ప్రముఖ నటి హేమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన గురించి నిరాధారమైన విషయాలను ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ పలు యూట్యూబ్ చానళ్ల నిర్వాహకులకు ఆమె లీగల్ నోటీసులు పంపారు. హేమ... నటి కరాటే కళ్యాణికి కూడా నోటీసులు పంపారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

కరాటే కళ్యాణి, తమన్నా సింహాద్రి యూట్యూబ్ ఛానెల్స్‌తో పాటు మరికొన్ని ఛానెల్స్‌కు హేమ తన న్యాయవాది ద్వారా నోటీసులు పంపారు. తప్పుడు కథనాలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హేమ తరపు న్యాయవాదులు తెలిపారు.

గతంలో హేమ బెంగుళూరులోని ఒక రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో చాలా మంది ఆమె గురించి వీడియోలు చేశారు. తనపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అప్పట్లోనే హేమ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆమె బెయిల్‌పై విడుదలయ్యారు. వైద్య పరీక్షల్లో నెగెటివ్ రిపోర్ట్ రావడంతో హేమకు ఊరట లభించింది. అయితే, అప్పటి నుంచి తన గురించి తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారని హేమ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Hema
Karate Kalyani
Legal Notice
YouTube Channels
False Propaganda
Social Media
Tammana Simhadri
Drug allegations
Bangalore Rave Party
Defamation
  • Loading...

More Telugu News