Vinil Pulivarthi: ఎమ్మెల్యే పులివర్తి నాని తనయుడికి వెరైటీగా బర్త్ డే గ్రీటింగ్స్ చెప్పిన ఫ్రెండ్స్... వీడియో ఇదిగో!

చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని తనయుడు వినీల్ పుట్టినరోజు జరుపుకున్నారు. అయితే, పులివర్తి వినీల్ బర్త్ డే సందర్భంగా అతడి ఫ్రెండ్స్, ఎన్నారై టీడీపీ మెంబర్స్ వినూత్న రీతిలో విషెస్ తెలియజేశారు.
ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ నగరంలో వినీల్ బర్త్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ సందర్భంగా అతడి ఫ్రెండ్స్ ఓ విమానానికి భారీ బ్యానర్ కట్టి గాల్లోకి తీసుకెళ్లారు. ఆ బ్యానర్ పై హ్యాపీ బర్త్ డే పులివర్తి వినీల్ అని రాసి ఉంది. ఆ బ్యానర్ తో ఉన్న విమానం గోల్డ్ కోస్ట్ గగనవీధుల్లో విహారం చేసింది. దీనికి సంబంధించిన వీడియోను ఎమ్మెల్యే పులివర్తి నాని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.