Narendra Modi: కొందరు ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటారు... సీఎం స్టాలిన్ పై మోదీ విమర్శలు

Modi Slams Stalin Some Always Cry

  • తమిళనాడుకు నిధులపై స్టాలిన్‌కు మోదీ కౌంటర్
  • నిధుల కేటాయింపుపై స్పష్టీకరణ
  • గతంతో పోలిస్తే తమిళనాడుకు మూడు రెట్లు ఎక్కువ నిధులు ఇస్తున్నామని వెల్లడి

తమిళనాడులోని రామేశ్వరంలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకు భారీగా నిధులు కేటాయిస్తోందని, గత ప్రభుత్వంతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ నిధులు ఇచ్చామని మోదీ స్పష్టం చేశారు.

"కొందరు కారణం లేకుండానే ఎప్పుడూ ఏడుస్తూ ఉంటారు" అంటూ స్టాలిన్ సహా ఇతర పార్టీల నేతలపై మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని, తమిళనాడును విస్మరిస్తోందని స్టాలిన్ చేసిన ఆరోపణలను ఆయన పరోక్షంగా తిప్పికొట్టారు.

గత దశాబ్దంలో తమిళనాడు అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు కేటాయించిందని, రైల్వే ప్రాజెక్టులకు నిధులు గణనీయంగా పెంచామని మోదీ వివరించారు. తమిళనాడు అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. కేంద్రం తమకు నిధులు ఇవ్వడం లేదని స్టాలిన్ చేస్తున్న ఆరోపణలను మోదీ ఖండించారు. 

అభివృద్ధి చెందిన భారతదేశంలో తమిళనాడు పాత్ర చాలా గొప్పదని అన్నారు. తమిళనాడు ఎంత బలంగా ఉంటే భారతదేశం అంత వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.

తమిళనాడు అభివృద్ధికి నిధుల కేటాయింపుపై స్పష్టతనిచ్చారు. గత ప్రభుత్వంతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ నిధులు కేటాయించినట్లు తెలిపారు. దశాబ్ద కాలంలో కేంద్ర ప్రభుత్వం తమిళనాడు అభివృద్ధికి గతంలో కంటే మూడు రెట్లు ఎక్కువ నిధులు కేటాయించిందని మోదీ పేర్కొన్నారు. 2014కు ముందు రైల్వే ప్రాజెక్టుకు ఏటా రూ.900 కోట్లు మాత్రమే వచ్చేవని, ఈ ఏడాది తమిళనాడు రైల్వే బడ్జెట్ రూ.6,000 కోట్లకు పైగా ఉందని అన్నారు. భారత ప్రభుత్వం ఇక్కడ 77 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తోందని, ఇందులో రామేశ్వరంలోని రైల్వే స్టేషన్ కూడా ఉందని ఆయన తెలిపారు. 

Narendra Modi
MK Stalin
Tamil Nadu
Central Government Funding
India Development
Rameswaram Rally
Tamil Nadu Politics
Modi's Criticism
Railway Projects
Fund Allocation
  • Loading...

More Telugu News