Peddi Movie Glimps: శ్రీరామనవమి శుభాకాంక్షలతో ‘పెద్ది’ గ్లింప్స్.. వీడియో ఇదిగో!

Ram Charans Peddi Glimpse Released on Sriramanavami

  • నేలమీద ఉన్నప్పుడే చేసేయ్యాలి.. పుడాతామా ఏంటి మళ్లీ అంటున్న చెర్రీ
  • ఉత్తరాంధ్ర యాసలో డైలాగ్ అదరగొట్టిన మెగా పవర్ స్టార్
  • స్పెషల్ అట్రాక్షన్ గా రెహమాన్ సంగీతం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా తుది దశలో ఉంది. ఈ సినిమాలో చెర్రీ సరసన జాన్వీ కపూర్ నటిస్తుండగా.. ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్స్, టైటిల్ పోస్టర్ విడుదల చేసిన విషయం విదితమే. తాజాగా శ్రీరామనవమి సందర్భంగా చిత్ర యూనిట్ ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేసింది.

ఈ వీడియోలో చెర్రీ లుక్ అదిరిపోయింది. ఉత్తరాంధ్ర యాసలో ఆయన చెప్పే డైలాగ్స్ కు థియేటర్లలో ఈలలు, చప్పట్లతో మార్మోగాల్సిందే. ‘ఏదైనా నేలమీద ఉన్నప్పుడే చేసేయ్యాలి.. పుడాతామా ఏంటి మళ్లీ” అంటూ రామ్ చరణ్ చెప్పడం చూడొచ్చు. గ్లింప్స్ చివర్లో చరణ్ కొట్టిన సిక్స్ షాట్ అద్భుతమని హీరో అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం స్పెషల్ అట్రాక్షన్ గా మారిందని చెబుతున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న ఈ సినిమా విడుదల కానుంది. గేమ్ ఛేంజర్ తర్వాత చరణ్ నటిస్తోన్న ఈ మాస్ యాక్షన్ పెద్ది సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Peddi Movie Glimps
Ram Charan
Janhvi Kapoor
Buchi Babu Sana
AR Rahman
Telugu Cinema
Tollywood
Mass Action
Movie Glimpse
March 27 Release
  • Loading...

More Telugu News