తిరుమల శ్రీవారి సేవలో ఏపీ హోంమంత్రి
- కుటుంబంతో కలిసి స్వామి వారి దర్శనం
- అభివృద్ధిలో రాష్ట్రం ముందుండాలని వేడుకున్నట్లు వెల్లడి
- రాష్ట్ర ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపిన హోంమంత్రి అనిత
శ్రీరామనవమి రోజు శ్రీవారిని దర్శించుకోవడం తనకు దక్కిన అదృష్టమని ఆమె అన్నారు. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ ముందుండాలని, రాష్ట్ర ప్రజలంతా సుఖ:సంతోషాలతో ఉండాలని తిరుమలేశుడిని ప్రార్థించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఏపీని అభివృద్ధి పథంలో నడిపిస్తుందన్నారు. విజన్- 2047, పీ-4 విధానంతో రాష్ట్ర ప్రజలను సంపన్నులుగా మార్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని చెప్పారు.