Yashasvi Jaiswal: టచ్ లోకి వచ్చిన యశస్వి జైస్వాల్... 200 ప్లస్ స్కోరు చేసిన రాజస్థాన్ రాయల్స్

- ఇటీవల ఫామ్ లో లేని యశస్వి జైస్వాల్
- నేడుపంజాబ్ కింగ్స్ పై అర్ధసెంచరీ
- 3 ఫోర్లు, 5 సిక్సులు బాదిన జైస్వాల్
- రాణించిన రియాన్ పరాగ్, కెప్టెన్ సంజు శాంసన్
- 20 ఓవర్లలో 4 వికెట్లకు 205 పరుగులు చేసిన రాజస్థాన్
ఇటీవల పెద్దగా ఫామ్ లో లేని యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మళ్లీ టచ్ లోకి వచ్చాడు. ఇవాళ పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో జైస్వాల్ విజృంభించాడు. 45 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సులతో 67 పరుగులు చేశాడు. అటు, కెప్టెన్ సంజూ శాంసన్ (38), రియాన్ పరాగ్ (43 నాటౌట్) కూడా రాణించడంతో రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 205 పరుగులు చేసింది.
హెట్మెయర్ 20, నితీశ్ రాణా 12, ధ్రువ్ జురెల్ 13 (నాటౌట్) పరుగులు చేశారు. జైస్వాల్ ఫామ్ లోకి రావడంతో రాజస్థాన్ శిబిరంలో సంతోషం నెలకొంది. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో లాకీ ఫెర్గుసన్ 2, అర్షదీప్ సింగ్ 1, మార్కో యన్సెన్ 1 వికెట్ తీశారు.