Meenakshi Natarajan: కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై స్పందించిన కాంగ్రెస్ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్

- పర్యావరణాన్ని కాపాడేందుకు కాంగ్రెస్ పోరాటం చేస్తుందన్న మీనాక్షి నటరాజన్
- మంత్రివర్గ కమిటీతో అన్ని అంశాలను చర్చిస్తున్నామని వెల్లడి
- అందరి వాదనలు విని ఏం చేయాలో ఆలోచిస్తామని వివరణ
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం రాజకీయ దుమారం రేపుతున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ స్పందించారు. పర్యావరణ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. కంచ గచ్చిబౌలి వ్యవహారంపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ కమిటీతో అన్ని అంశాలపై చర్చలు జరుపుతున్నామని తెలిపారు.
అందరి వాదనలను పరగణనలోకి తీసుకుంటామని, ఆ తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటామని ఆమె వెల్లడించారు. ఎవరికీ నష్టం వాటిల్లకుండా వివాదాన్ని పరిష్కరించాలనేది తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. విద్యార్థుల లేఖలపై సమాచారం సేకరిస్తామని మీనాక్షి నటరాజన్ హామీ ఇచ్చారు. ప్రతిపక్షాల ఆరోపణల్లోని వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు ప్రయత్నిస్తామని అన్నారు.