నెక్స్ట్ మ్యాచ్ కు కూడా రోహిత్ శర్మ డౌటే?
- ఐపీఎల్ లో పేలవ ప్రదర్శనతో నిరాశ పరుస్తున్న రోహిత్
- గాయం కారణంగా నిన్నటి మ్యాచ్ కు దూరం
- కొన్ని రోజులు విశ్రాంతిని ఇవ్వాలని నిర్ణయించామన్న హెడ్ కోచ్ జయవర్దనే
నిన్నటి మ్యాచ్ కు ముందు ఒక వీడియో వైరల్ అయింది. ప్రాక్టీస్ సమయంలో రోహిత్ మోకాలిపై బంతి తగిలినట్టు వీడియోలో కనిపించింది. మ్యాచ్ తర్వాత ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ జయవర్దనే మాట్లాడుతూ... రోహిత్ కు మోకాలి దగ్గర గాయమయిందని చెప్పారు. రోహిత్ కు కొన్ని రోజులు విశ్రాంతిని ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు.
వరుసగా విఫలమవుతున్న రోహిత్ ను మూడో మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకొచ్చారు. నాలుగో మ్యాచ్ లో పక్కన పెట్టేశారనే ప్రచారం కూడా జరుగుతోంది. రోహిత్ కు కొన్ని రోజులు విశ్రాంతిని ఇస్తామని జయవర్దనే చెప్పడంతో... తదుపరి మ్యాచ్ లో కూడా రోహిత్ ఆడటం అనుమానంగానే కనిపిస్తోంది.