K. Veerraghava Reddy: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన పూజారిపై దాడి కేసు... ప్రధాన నిందితుడికి బెయిల్

Bail Granted to Main Accused in Chilakuru Balaji Temple Priest Attack Case

  • రంగరాజన్‌పై దాడి కేసులో నిందితుడు వీరరాఘవరెడ్డి అరెస్టు
  • వీరరాఘవరెడ్డికి బెయిల్ మంజూరు చేసిన కోర్టు
  • రూ. 15 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశం

చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన పూజారి రంగరాజన్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడు కె. వీరరాఘవరెడ్డికి బెయిల్ మంజూరైంది. రాజేంద్రనగర్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. రూ. 15 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.

దాదాపు రెండు నెలల క్రితం రంగరాజన్‌పై దాడి కేసులో రామరాజ్యం వ్యవస్థాపకుడు వీరరాఘవ రెడ్డి, ఇద్దరు మహిళలు సహా మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. తమ సంస్థకు ఆర్థిక సాయం చేయాలని, రామరాజ్యంలో సభ్యులను చేర్పించాలని రంగరాజన్‌ను వీరరాఘవరెడ్డి డిమాండ్ చేశాడు. ఇందుకు రంగరాజన్ నిరాకరించడంతో దాడి చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

K. Veerraghava Reddy
Chilakuru Balaji Temple
Rangarajan
Attack Case
Bail Granted
Rajendranagar Court
Rama Rajyam
Andhra Pradesh
Temple Priest Assault
Religious Institution
  • Loading...

More Telugu News