Shoaib: ట్రాఫిక్ ఎస్సైపై రెచ్చిపోయిన వాహనదారుడు

Driver Attacks Traffic SI in Hyderabad

  • సికింద్రాబాద్‌లోని బోయినపల్లిలో ఘటన
  • షోయబ్ అనే వ్యక్తి వాహనాన్ని ఆపిన ట్రాఫిక్ పోలీసులు
  • నా వాహనాన్నే ఆపుతారా అంటూ పోలీసులపై దాడికి యత్నించిన షోయబ్

భాగ్యనగరంలో ఓ వాహనదారుడు ట్రాఫిక్ ఎస్సైపై దురుసుగా ప్రవర్తించాడు. సికింద్రాబాద్‌లోని బోయినపల్లి వద్ద ట్రాఫిక్ ఎస్సైతో షోయబ్ అనే వాహనదారుడు వాగ్వాదానికి దిగాడు. వాహనాల తనిఖీల్లో భాగంగా పోలీసులు షోయబ్ వాహనాన్ని ఆపారు. దీంతో ఆగ్రహించిన షోయబ్ నా వాహనాన్నే ఆపుతారా అంటూ పోలీసులపై దాడికి ప్రయత్నించాడు.

వాహనానికి ఫోకస్ లైట్లు ఎందుకు వేశావని ఎస్సై ప్రశ్నించడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. వాహనదారుడు ట్రాఫిక్ ఎస్సైపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని బోయినపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా, తనపై పోలీసులే దాడి చేశారని షోయబ్ ఆరోపిస్తున్నాడు.

Shoaib
Traffic Police Assault
Hyderabad Traffic Police
Boyanapalli Police Station
Sikanderabad Traffic
Vehicle Inspection
Argument with Police
Police Assault Allegation
Road Rage Incident
Telangana Police
  • Loading...

More Telugu News