Bandi Sanjay: టీటీడీ ఛైర్మన్ కు బండి సంజయ్ లేఖ

Bandi Sanjays Letter to TTD Chairman

  • కరీంనగర్ లో టీటీడీ ఆలయ నిర్మాణానికి 2023లో అనుమతి లభించిందన్న సంజయ్
  • 10 ఎకరాల భూమిలో భూమిపూజ కూడా జరిగిందని వెల్లడి
  • ఆలయ నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగేలా చర్యలు తీసుకోవాలని విన్నపం

టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ లేఖ రాశారు. ధూప, దీప, నైవేద్యాలకు నోచుకోని అనేక దేశాలయాను టీటీడీ ఆదుకోవడం గొప్ప విషయమని లేఖలో ఆయన ప్రశంసించారు. దేశ వ్యాప్తంగా ధర్మ ప్రచారం చేయడంతో పాటు, హిందూ దేవాలయాల నిర్మాణానికి టీటీడీ ఎంతో కృషి చేస్తోందని కితాబునిచ్చారు. 

2023లో కరీంనగర్ లో టీటీడీ ఆలయ నిర్మాణానికి అనుమతి లభించిందని, అదే ఏడాది మే 31న 10 ఎకరాల భూమిలో భూమిపూజ కూడా జరిగిందని బండి సంజయ్ తెలిపారు. అయితే, ఆ తర్వాత ఆలయం నిర్మాణం దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని చెప్పారు. టీటీడీ నిర్మించే ఆలయం కోసం కరీంనగర్ తో పాటు చుట్టుపక్కల జిల్లాల భక్తులు కూడా ఎదురు చూస్తున్నారని.... ఆలయ నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Bandi Sanjay
TTD Chairman
BR Naidu
Tirumala Tirupati Devasthanams
Karimnagar Temple
Hindu Temple Construction
Temple Development
Andhra Pradesh
India
Religious Affairs
  • Loading...

More Telugu News