తార‌క్‌పై హృతిక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్... 'వార్‌2' వ‌చ్చేది అప్పుడేన‌ట‌!

  • త‌న ఫేవ‌రేట్ కో-స్టార్ ఎన్‌టీఆర్ అన్న హృతిక్ రోష‌న్‌
  • అత‌నోక అద్భుత న‌టుడే కాకుండా మంచి మ‌నిషి అంటూ కితాబు
  • 'వార్ 2'లో ఆయ‌న‌తో క‌లిసి న‌టించ‌డం ఆనందంగా ఉంద‌న్న  బాలీవుడ్ న‌టుడు 
  • సినిమాను ఆగ‌ష్టు 14న విడుద‌ల చేస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌
టాలీవుడ్ స్టార్ న‌టుడు జూనియ‌ర్ ఎన్టీఆర్‌పై బాలీవుడ్ న‌టుడు హృతిక్ రోష‌న్ ప్ర‌శంస‌లు కురిపించారు. తాజాగా ఆయ‌న‌ ఒక ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా హృతిక్‌ని యాంక‌ర్ మీ నా ఫేవ‌రేట్ కో-స్టార్ ఎవ‌రు అని అడిగారు. 

దీనికి హృతిక్ రోష‌న్ బ‌దులిస్తూ.. త‌న ఫేవరెట్ కో స్టార్ తెలుగు యాక్ట‌ర్ జూనియ‌ర్‌ ఎన్టీఆర్ అని చెప్పారు. అత‌నోక అద్భుత న‌టుడే కాకుండా మంచి మ‌నిషి. గోల్డెన్ హార్ట్. 'వార్ 2'లో ఆయ‌న‌తో క‌లిసి న‌టించ‌డం ఆనందంగా ఉందంటూ హృతిక్ రోష‌న్ చెప్పుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట‌ వైర‌ల్ అవుతోంది. 

అలాగే ఈ సంద‌ర్భంగా 'వార్‌ 2' విడుద‌ల తేదీని కూడా హృతిక్ ఖ‌రారు చేశారు. ఈ సినిమాను స్వాతంత్ర్య దినోత్స‌వం కానుక‌గా.. ఆగ‌ష్టు 14న విడుద‌ల చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. 

ఇక హృతిక్‌ రోష‌న్ క‌థానాయకుడిగా న‌టిస్తున్న 'వార్ 2'లో తార‌క్‌ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. వార్ సినిమాకు సీక్వెల్‌గా వ‌స్తున్న ఈ చిత్రానికి అయ‌న్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జాన్‌ అబ్రహాం, కియారా అద్వానీ ఇత‌ర కీలక పాత్రలలో నటిస్తున్నారు.

ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుడ‌గా... ఎన్టీఆర్ త‌న పాత్ర‌కు సంబంధించిన షూటింగ్‌ని ఇప్ప‌టికే పూర్తి చేశారు. అయితే, ఈ సినిమా రిలీజ్ డేట్‌ ఎప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానుల‌కు హృతిక్ రోష‌న్ సాలిడ్ అప్‌డేట్ ఇవ్వ‌డంతో తార‌క్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.




More Telugu News