Honda CB350: సరికొత్త కలర్ ఆప్షన్లతో మూడు వేరియంట్లలో హోండా సీబీ 350

Honda CB350 Three Variants with New Colors Launched

  • 2025 మోడ్రన్ క్లాసిక్ మోటార్ సైకిళ్ల లైనప్‌లో మూడు వేరియంట్లు
  • సీబీ350 హెచ్’నెస్’, ‘సీబీ350, ‘సీబీ350 ఆర్‌ఎస్’లను విడుదల చేసిన హోండా
  • ఆకర్షణీయమైన కలర్ వేరియంట్లు.. ఆకట్టుకునే ఫీచర్లు
  • ధర రూ. 2.10 లక్షల నుంచి మొదలై రూ. 2.19 లక్షల వరకు (ఎక్స్ షోరూం)

హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) తన 2025 మోడ్రన్ క్లాసికల్ మోటార్ సైకిళ్ల శ్రేణిలో ‘సీబీ350 హెచ్’నెస్’, ‘సీబీ350’, ‘సీబీ350 ఆర్‌ఎస్’ మోడళ్లను మార్కెట్లో విడుదల చేసింది. వీటి ధర ర. 2.10 లక్షల నుంచి ప్రారంభమై మోడల్‌ను బట్టి రూ. 2.19 లక్షలు (ఎక్స్ షోరూం) వరకు ఉన్నాయి.
 
2025 హోండా సీబీ350 సిరీస్ ఫీచర్లు
హోండా విడుదల చేసిన ఈ మూడు వేరియంట్లలో సీబీ 350 సిరీస్ ప్రధానమైనది. ఇది 348.36 సీసీ, ఎయిర్ కూల్డ్, ఫోర్-స్ట్రోక్, సింగిల్-సిలిండర్, ఫ్యూయల్-ఇంజెక్ట్ చేయబడిన పవర్‌ట్రెయిన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజిన్ ఓబీడీ-2బీ నిబంధనలకు అనుగుణంగా ఉండటమే కాకుండా, ప్రభుత్వ స్థిరత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఈ20 ఇంధన ప్రమాణాలను కూడా ఉన్నాయి. ఆకట్టుకునే ట్యూనింగ్‌తో వస్తోంది. 

సీబీ 350 హెచ్’నెస్, సీబీ 350 ఆర్ఎస్ మోడళ్లు 5,500 ఆర్పీఎం వద్ద 20.7 బీహెచ్‌పీ శక్తిని, 3,000 ఆర్పీఎం వద్ద 30 ఎన్ఎం గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తాయి. అయితే సీబీ 350 అదే ఆర్పీఎం వద్ద అసాధారణమైన 29.5 ఎన్ఎం గరిష్ఠ టార్క్‌ను అందిస్తుంది. అన్ని మోడళ్లు క్రూజింగ్ కోసం సులభమైన 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తున్నాయి. పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, మ్యాట్ మార్షల్ గ్రీన్ మెటాలిక్, మ్యాట్ డ్యూన్ బ్రౌన్, మ్యాట్ క్రస్ట్ మెటాలిక్, ప్రీషియస్ రెడ్ మెటాలిక్ వంటి ఆకర్షణీయమైన షేడ్లలో అందుబాటులో ఉన్నాయి. ప్రీమియం డీఎల్ఎక్స్ ప్రో వేరియంట్ చిక్ కరోమ్ యాక్సెంట్‌లు, ప్రత్యేకమైన రంగుల సీట్లతో మరింత ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇవి రూ. 2.15 లక్షల నుంచి రూ. 2.19 లక్షలు (ఎక్స్ షోరూం, ఢిల్లీ) గా ఉన్నాయి.

2025 హోండా సీబీ350 హెచ్’నెస్   
హోండా సీబీ 350 హెచ్’నెస్.. డీఎల్ఎక్స్, డీఎల్ఎక్స్ ప్రొ, డీఎల్ఎక్స్ క్రోమ్ తాజా రంగుల ఎంపికలు ఆకర్షణీయంగా ఉన్నాయి. డీఎల్ఎక్స్ వేరియంట్ పెర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే, పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్ వంటి సొగసైన రంగులను కలిగి ఉంది. డీఎల్ఎక్స్ ప్రో.. రెబెల్ రెడ్ మెటాలిక్, పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, పెర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. డీఎల్ఎక్స్ క్రోమ్ అథ్లెటిక్ బ్లూ మెటాలిక్, పెర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే, పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్ వంటి రంగుల్లో స్టైల్‌ను ఎలివేట్ చేస్తుంది. ధరలు రూ. 2.10 లక్షల నుంచి ప్రారంభమై రూ. 2.15 లక్షల వరకు  (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఉన్నాయి. 

2025 హోండా సీబీ 350ఆర్ఎస్
2025 సీబీ 350ఆర్ఎస్.. డీఎల్ఎక్స్, డీఎల్ఎక్స్ ప్రొ ట్రిమ్‌లలో వస్తోంది. డీఎల్ఎక్స్ వేరియంట్ పెర్ల్ డీప్ గ్రౌండ్ గ్రే, పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్‌తో సరికొత్తగా ఉంది. డీఎల్ఎక్స్ ప్రో రెబెల్ రెడ్ మెటాలిక్, పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్ ఆప్షన్స‌తో వస్తోంది. దీని ప్రారంభ ధర రూ. 2.15 లక్షలు కాగా, గరిష్ఠంగా రూ. 2.19 లక్షల వరకు (ఎక్స్ షోరూం) ఉంది. 

Honda CB350
Honda Motorcycle and Scooter India
CB350 H'ness
CB350 RS
CB350
New Color Options
Motorcycle Launch
2025 Honda CB350 Series
Bike Price in India
350cc Motorcycle
  • Loading...

More Telugu News