భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
ఈ నెల 1న బంగారం ధర రూ. 94 వేలపైకి ఎగబాకగా, ఇప్పటి వరకు రూ. 3 వేలు తగ్గింది. అలాగే, వెండి ధర రెండు రోజుల క్రితం రూ. 1.02 లక్షలు ఉండగా రూ. 12 వేలకు పైగా తగ్గింది. అంతర్జాతీయంగా ఔన్సు (31.10 గ్రాములు) మేలిమి బంగారం ధర నిన్న ఒక్క రోజే 80 డాలర్లకు పైగా తగ్గడం, వెండి ధర కూడా అదే స్థాయిలో పతనం కావడంతో దేశీయంగా వాటి ధరలు దిగి వచ్చాయి.