జీవన ప్రమాణాలు పెంచే విధంగా మన విద్యా విధానం ఉండాలి: రేవంత్ రెడ్డి
- ఉత్తమ విద్యా వ్యవస్థ కోసం పాలసీ తయారు చేయాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశం
- క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా ఆచరణ సాధ్యమయ్యేలా పాలసీ ఉండాలన్న సీఎం
- జీవన ప్రమాణాలు పెంచే విధంగా విద్యా విధానం ఉండాలని అధికారులకు సూచన
క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా, ఆచరణ సాధ్యమయ్యేలా పాలసీ ఉండాలని ఆయన అన్నారు. జీవన ప్రమాణాలు పెంచే విధంగా విద్యావిధానం ఉండాలని అధికారులకు సూచించారు. భాషతో పాటు, విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానం పెంచేలా ఈ పాలసీ ఉండాలని అన్నారు. ఉత్తమ విద్యా వ్యవస్థ కోసం ఎంత ఖర్చైనా కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకాడబోదని ఆయన స్పష్టం చేశారు.