Hyderabad Traffic Police: మైనర్ల డ్రైవింగ్‌పై హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల కీలక నిర్ణయం

Hyderabad Traffic Polices Crucial Decision on Minor Driving

  • మైనర్లు వాహనం నడిపితే తల్లిదండ్రులు లేదా వాహన యజమానులను బాధ్యులను చేయాలని నిర్ణయం
  • మైనర్లు నడిపిన వాహనం రిజిస్ట్రేషన్ ఏడాది పాటు రద్దు చేస్తామని వెల్లడి
  • పట్టుబడిన మైనర్లకు 25 ఏళ్లు వచ్చే వరకు లైసెన్స్‌కు అనర్హులు

హైదరాబాద్ నగర ట్రాఫిక్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. నగరంలో మైనర్ల డ్రైవింగ్‌ను నియంత్రించేందుకు చర్యలు చేపట్టారు. ఇకపై మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే, వారి తల్లిదండ్రులను లేదా వాహన యజమానులను కూడా బాధ్యులుగా పరిగణిస్తారు.

మైనర్లు నడిపిన వాహనం యొక్క రిజిస్ట్రేషన్‌ను ఏడాది పాటు రద్దు చేస్తామని పోలీసులు తెలిపారు. అంతేకాకుండా, వాహనం నడుపుతూ పట్టుబడిన మైనర్లు 25 సంవత్సరాలు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి అనర్హులని స్పష్టం చేశారు.

ఈ మేరకు హైదరాబాద్ పోలీసులు తమ 'ఎక్స్' వేదికగా హెచ్చరిక జారీ చేశారు. మైనర్లకు వాహనం ఇచ్చినట్లయితే, ఏడాది వరకు వాహనం రిజిస్ట్రేషన్ రద్దు చేయడంతో పాటు, మూడేళ్ల వరకు జైలు శిక్ష మరియు రూ. 25,000 వరకు జరిమానా విధించబడుతుందని హెచ్చరించారు.

Hyderabad Traffic Police
Minor Driving
Driving License
Vehicle Registration Cancellation
Traffic Rules
Hyderabad
India
Road Safety
Legal Consequences
Penalty for Minor Driving
  • Loading...

More Telugu News