వామనరావు హత్య కేసు.. రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
- సీబీఐతో విచారణ జరిపించాలని గతంలో పిటిషన్
- కేసుకు సంబంధించి పూర్తి పత్రాలను సమర్పించాలని ఆదేశాలు
- వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్న సుప్రీంకోర్టు
- తదుపరి విచారణ వాయిదా
అన్ని పత్రాలను తమ ముందు ఉంచితే వాటిని పరిశీలించి సీబీఐ విచారణపై నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు ధర్మాసనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో రికార్డులు అందజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ ఈ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కోర్టు ఆదేశిస్తే విచారణ చేపట్టడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కూడా సీబీఐకి అప్పగించేందుకు అభ్యంతరం లేదని స్పష్టం చేసింది.