కోహ్లీ హోట‌ల్ రూమ్ ప్రైవేట్ వీడియో నెట్టింట హ‌ల్‌చ‌ల్‌!

     
టీమిండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీకి సంబంధించిన హోట‌ల్ రూమ్ ప్రైవేట్ వీడియో ఒక‌టి బ‌య‌ట‌కు రావ‌డంతో నెట్టింట్ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. వీడియోలో కోహ్లీ ఉప‌యోగించే వ్య‌క్తిగ‌త‌ వ‌స్తువుల‌న్నింటినీ చూడొచ్చు. ర‌న్ మెషీన్ గ‌దిలో ఏ వ‌స్తువులు ఉంటాయ‌నే విష‌యం ఈ వీడియోలో క్లియ‌ర్‌గా ఉంది.  

కోహ్లీ వాడే జెర్సీలు, షూస్‌, క్రికెట్ కిట్‌, దేవుడి విగ్ర‌హాలు, డైట్‌కి సంబంధించినవి ఇలా అన్ని వ‌స్తువులు వీడియోలో క‌నిపిస్తున్నాయి. అయితే, ఈ వీడియో విరాట్ కోహ్లీకి తెలిసి బ‌య‌ట‌కు వ‌చ్చిందా లేదా ఎవ‌రైనా ర‌హ‌స్యంగా చిత్రీక‌రించి బ‌య‌ట‌కు వ‌దిలారా అనే విష‌యం తెలియాల్సి ఉంది. 

ప్ర‌స్తుతం వీడియో మాత్రం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన‌శైలిలో స్పందిస్తున్నారు. వీడియో చూసిన కొంద‌రు... కోహ్లీకి భ‌ద్ర‌త లేకుండా చేస్తున్నార‌ని, వ్య‌క్తిగ‌త విష‌యాలు బ‌య‌ట‌పెడుతున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. 


More Telugu News