Alekhya Chitti Pickles: మహిళా కస్టమర్ పై తిట్లదండకం.. అలేఖ్య చిట్టి పికిల్స్ తాజా ఆడియో

Woman Customer Abused by Alekhya Chitti Pickles Owner Audio Leaks Online

--


ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో ఒక ఫన్నీ కామెంట్‌తో పాప్యులర్ అయిన అలేఖ్య చిట్టి పికిల్స్.. తాజాగా దుకాణం బంద్ అయింది. ఓ ఆడియో కారణంగా మొత్తం వ్యాపారమే మూతపడింది. ‘మీ పచ్చళ్లు ఇంత ధర ఎందుకున్నాయో అర్థం కావడం లేదు’ అంటూ ఓ నెటిజన్ చేసిన కామెంట్ కు బూతులతో కూడిన వాయిస్ మెసేజ్ రావడంతో సదరు కస్టమర్ ఖంగుతిన్నాడు. ఆ ఆడియో మెసేజ్ ను సోషల్ మీడియాలో పెట్టడంతో అలేఖ్య చిట్టి పికిల్స్ అక్కాచెల్లెళ్లపై నెటిజన్లు మండిపడుతున్నారు. దీంతో అక్కాచెల్లెళ్లు ప్రస్తుతం వాట్సాప్ నెంబర్ ను, వెబ్ సైట్ ను మూసివేశారు. ఇన్ స్టాలోనూ స్పందించడం లేదు. తాజాగా ఈ అక్కాచెల్లెళ్లు పంపిన మరో ఆడియో వెలుగులోకి వచ్చింది. 

తాజా ఆడియోలో అలేఖ్య చిట్టి పికిల్స్ నిర్వాహకులు మహిళా కస్టమర్‌ పై తిట్లదండకం చదివారు. ‘ఒసేయ్ పిచ్చి మొఖం దానా ఇంత తక్కువ రేట్లను కూడా నువ్వు భరించలేకపోతున్నావ్, ధర ఎక్కువ అంటున్నావ్ అంటే.. నీ దరిద్రం ఏ రేంజ్‌లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాట విని నాలుగు ఇళ్లు వెతుక్కుని, పాచిపని చేసుకుంటూ  బ్రతుకు’ అని తిట్టడం వినిపించింది. ప్రస్తుతం ఈ ఆడియోకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Alekhya Chitti Pickles
Viral Audio
Abuse
Customer Complaint
Social Media Controversy
Online Business
Pickle Price
Woman Customer
Instagram Video
Telugu Business
  • Loading...

More Telugu News