Ram Charan: తన 40వ పుట్టినరోజు సందర్భంగా బుచ్చిబాబుకు ప్రత్యేక బహుమతులు పంపిన రామ్ చరణ్

Ram Charans Special Birthday Gift to Buchi Babu

  • బుచ్చిబాబుకు హనుమాన్ చాలీసా పంపిన చరణ్
  • తనకు హనుమాన్ చాలీసా అత్యంత శక్తిని ఇచ్చిందన్న చరణ్
  • సంతోషం వ్యక్తం చేసిన బుచ్చిబాబు

టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ 40వ ఏట అడుగుపెట్టారు. ఈ సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబుకు చరణ్ ప్రత్యేక బహుమతులను పంపించారు. గిఫ్టులను పంపిస్తూ... ఒక లేఖను  కూడా జోడించారు. 'బుచ్చి... హనుమాన్ చాలీసా నాకు జీవితంలో అత్యంత గొప్ప శక్తిని ఇచ్చింది. కఠిన సమయాల్లో సైతం హనుమాన్ పై నాకున్న నమ్మకం నన్ను నిలబెట్టింది. నేను 40వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ఆ శక్తిలో కొంత నీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. నా జీవితంలో నీకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. నీవు ఎప్పుడూ బాగుండాలి. దేవుడి దీవెనలు నీకు ఉండాలి. ఇది కేవలం గిఫ్ట్ మాత్రమే కాదు. నీ మీద మాకున్న ప్రేమను చాటుతుంది' అని లేఖలో చరణ్ పేర్కొన్నారు. ఈ మేరకు చరణ్, ఉపాసన ఇద్దరూ గిఫ్ట్ పంపారు. చరణ్ దంపతులు పంపిన గిఫ్ట్ పై బుచ్చిబాబు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

Ram Charan
Buchi Babu
40th Birthday
Gift
Tollywood
Hanuman Chalisa
Upasana Konidela
Telugu Cinema
Special Gift
Ram Charan's 40th Birthday
  • Loading...

More Telugu News