Andhra Pradesh: ఎయిడ్స్ నియంత్రణలో ఏపీ భేష్... ప్రశంసించిన 'నాకో'

- 90వ దశకంలో అనేకమందిని బలిగొన్న ఎయిడ్స్ మహమ్మారి
- అప్రమత్తమైన ప్రభుత్వాలు
- క్రమంగా ప్రజల్లోనూ అవగాహన
- తాజాగా ఎయిడ్స్ నియంత్రణపై నాకో నివేదికలో ఏపీకి ఏడో స్థానం
90వ దశకంలో హెచ్ఐవీ-ఎయిడ్స్ మహమ్మారి కారణంగా పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. అనేక కుటుంబాలు సామాజికంగా పతనావస్థకు చేరుకున్నాయి. ప్రభుత్వాలు అప్రమత్తమై నివారణ చర్యలు తీసుకోవడం, ఎయిడ్స్ కు ఔషధాలు రావడం, ప్రజల్లో అవగాహన పెరగడం వంటి కారణాలతో ఈ ప్రాణాంతక వ్యాధి నెమ్మదించింది.
తాజాగా, ఎయిడ్స్ నియంత్రణలో ఏపీ మెరుగైన పనితీరు కనబర్చినట్టు కేంద్రం వెల్లడించింది. నాకో (నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్) నివేదికలో ఏపీ ఏడో స్థానంలో నిలిచింది. గతేడాది ఏప్రిల్-డిసెంబర్ మధ్య ఏపీ శాక్స్ (ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ) మెరుగైన పనితీరు కనబర్చినట్టు నాకో వెల్లడించింది. ఎయిడ్స్ నియంత్రణలో ఏపీ కృషి ప్రశంసనీయమని పేర్కొంది.
ఈ నేపథ్యంలో, ఎయిడ్స్ మహమ్మారి కట్టడికి కృషి చేసిన ఏపీ శాక్స్ పీడీని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రశంసించారు.