Allu Arjun: తనయుడికి బర్త్ డే విషెస్ తెలిపిన అల్లు అర్జున్

Allu Arjun Wishes Son Allu Ayaan on 11th Birthday

  • నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న అల్లు అయాన్
  • సోషల్ మీడియాలో స్పందించిన అల్లు అర్జున్
  • ఇన్ స్టాగ్రామ్ లో ఫొటో షేర్ చేసిన వైనం

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ నేడు 11వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన కుమారుడి ఫోటోను ఇన్ స్టాగ్రామ్ లో పంచుకుంటూ, "నా జీవితంలో వెలుగులు నింపిన అయాన్ కు జన్మదిన శుభాకాంక్షలు" అని పేర్కొన్నారు.

అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి కూడా సోషల్ మీడియా వేదికగా తన కుమారుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అయాన్ చిన్ననాటి జ్ఞాపకాలను ఒక వీడియో రూపంలో షేర్ చేస్తూ, "మా అల్లారు ముద్దుబిడ్డకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి" అని ఆమె పేర్కొన్నారు.

అల్లు అర్జున్, స్నేహారెడ్డి, అయాన్, అర్హ ఇంట్లోనే బర్త్ డే వేడుక జరుపుకున్నారు. అర్ధరాత్రి జరిగిన ఈ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోలను స్నేహారెడ్డి అభిమానులతో పంచుకున్నారు. అయాన్ పుట్టినరోజు కేక్ కట్ చేస్తుండగా కుటుంబ సభ్యులందరూ చుట్టూ చేరి సందడి చేశారు.

అయితే, అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం అల్లు అర్జున్ కొత్త హెయిర్ స్టైల్. దీనితో ఆయన తదుపరి ప్రాజెక్టులపై ఊహాగానాలు మొదలయ్యాయి. వెనుకవైపు నుంచి మాత్రమే కనిపించడంతో, ఆయన తన కొత్త లుక్ ను రహస్యంగా ఉంచాలని అనుకుంటున్నట్టుంది  అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే, ఆయన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక పౌరాణిక చిత్రంలో నటించనున్నట్టు తెలుస్తోంది. ఇది కార్తికేయ స్వామి పురాణ గాథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు సమాచారం. అల్లు అర్జున్ మొదటిసారిగా ఈ తరహా జానర్ లో నటించనుండటం విశేషం. దీనితో పాటు, అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో ఒక పాన్-ఇండియన్ ప్రాజెక్ట్ లో కూడా పనిచేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా వెల్లడయ్యే అవకాశం ఉంది.

Allu Arjun
Allu Ayaan
Birthday
Sneha Reddy
Tollywood
Telugu Cinema
Allu Arjun new movie
Allu Arjun Hairstyle
Trivikram Srinivas
Pan-Indian Project
  • Loading...

More Telugu News